భారతదేశం, నవంబర్ 24 -- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అర్ధరాత్రి పెట్రోలింగ్ చేశారు. ఆన్-గ్రౌండ్ పోలీసింగ్‌ను అంచనా వేయడానికి, ప్రజా భద్రతను నిర్ధారించడానికి వెళ్లారు. ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి సైరన్లు మోగకుండా లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్, ఆషమ్ నగర్, డిఫెన్స్ కాలనీలోని అనేక మంది రౌడీ-షీటర్ల ఇళ్లకు సజ్జనార్ వెళ్లారు. వారి గత ప్రవర్తన, ప్రస్తుత వృత్తి, జీవనశైలి గురించి ఆరా తీశారు. వారు తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని గడపాలని, సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యులుగా మారాలని సూచించారు.

సోమవారం తెల్లవారుజామున 12 గంటల నుండి 3 గంటల వరకు కమిషనర్ లంగర్ హౌజ్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, కీలక జంక్షన్లు, సున్నితమైన ప్రదేశాలను పరిశీ...