భారతదేశం, అక్టోబర్ 7 -- ఆరోగ్యానికి మూల స్తంభాలలో నిద్ర ఒకటి. కానీ, 1997 నుంచి 2012 మధ్య జన్మించిన 'జెన్-Z' (జనరేషన్-Z) యువత మాత్రం, తగినంత విశ్రాంతి పొందడంలో అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్ని పెద్దలు 'దురలవాటు'గా కొట్టిపారేయవచ్చు. కానీ, దీని వెనుక ఉన్న వాస్తవం చాలా క్లిష్టమైంది. నిరంతర డిజిటల్ వినియోగం, తీవ్రమైన ఆందోళన (Anxiety) స్థాయిలు, పెరుగుతున్న డిప్రెషన్ కేసులు ఈ దీర్ఘకాలిక నిద్ర లేమికి (Chronic Sleep Deficit) ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

'సైన్స్‌డైరెక్ట్'లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఈ యువత రోజుకు కేవలం 6 గంటల నిద్ర మాత్రమే పొందుతున్నారు. ఇది యువకులు, యుక్త వయస్కులకు సిఫార్సు చేసిన 8 నుంచి 10 గంటల కంటే చాలా తక్కువ. జెన్-Zలో దీర్ఘకాలిక నిద్ర లేమి కేవలం మానసిక ఆరోగ్యాన్నే కాదు, వారి ఆలోచనా సామర్థ్యాలు, మొత్తం ఆరోగ్...