భారతదేశం, అక్టోబర్ 11 -- ఓటీటీలోకి మరో సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ఉత్కంఠతో ఊపేసే చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఓ వైపు భయం, మరోవైపు మిస్టరీ, ఇంకోవైపు తప్పించుకోవడం.. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమానే 'మాస్క్'. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ 'మాస్క్' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి ఆదివారం కథా సుధలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సండే (అక్టోబర్ 12) కథా సుధలో భాగంగా మాస్క్ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

ఈటీవీ విన్ ఓటీటీలోకి రాబోతున్న మాస్క్ మూవీ ఇంట్లో దొంగతనం చూట్టూ సాగ...