భారతదేశం, ఆగస్టు 7 -- డిఫరెంట్ స్టోరీ లైన్ తో, మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో తెరకెక్కిన తమిళ థ్రిల్లర్ చిత్రం 'యాదుమ్ అరియాన్' (Yaadhum ariyaan) ఓటీటీలోకి వచ్చేస్తోంది. మర్దర్ చూట్టూ సాగే గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ కు కచ్చితంగా థ్రిల్ పంచే సినిమా ఇది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో చూద్దాం.

తమిళ థ్రిల్లర్ సినిమా 'యాదుమ్ అరియాన్' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఈ మూవీ ఆహా తమిళ్ లోకి రాబోతోంది. ఆగస్టు 8 న ఓటీటీలోకి అడుగుపెడుతుంది. అంటే రేపటి (శుక్రవారం) నుంచి ఓటీటీ లవర్స్ కు థ్రిల్ పంచేందుకు రెడీ అయింది. ప్రస్తుతానికి ఈ మూవీ తమిళంలోనే అందుబాటులోకి రానుంది.

జులై 18న థియేటర్లలో రిలీజైంది యాదుమ్ అరియాన్. ఈ థ్రిల్లర్ మూవీ పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతంమాత్రంగానే దక్కాయి. 96 నిమిషాల రన్ టైమ్ మాత్రమే ఉన్న ఈ సినిమాకు...