భారతదేశం, సెప్టెంబర్ 27 -- భారత దేశంలో నిత్యం చిత్ర, విచిత్ర సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో అవి సోషల్​ మీడియాలో వైరల్​గా మారుతూనే ఉంటాయి. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వైరల్​ అయ్యింది! రైలు అప్పర్​ బెర్త్​లో అండర్​వేర్​లు, బనియన్లు ఆరేసి ఉన్న ఒక ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

భారతదేశంలో రద్దీగా ఉండే రైళ్లలో ప్రయాణించడం చాలావరకు ఒత్తిడితో కూడిన అనుభవంగా ఉంటుంది. కాస్త చోటు కోసం ప్రయాణికులు తోసుకోవడం, నెట్టుకోవడం వంటి దృశ్యాలు సర్వసాధారణం. అయితే రైలు ప్రయాణంలో ఒక ప్రయాణికుడికి 'సివిక్ సెన్స్' (సామాజిక స్పృహ) లేకపోవడంపై ఇటీవల రెడిట్ పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది.

"ఇండియన్ రైల్వేస్‌లో మాత్రమే" అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఒక జనరల్ కోచ్‌లో ప్రయాణికుడు అప్పర్​ బెర్త్​కు అమర్చిన యూటిలిటీ ర్యాక్‌పై బట్టలు ఆ...