భారతదేశం, జనవరి 28 -- బాలీవుడ్ సినీ లవర్స్ మాత్రమే కాదు ప్రపంచంలోని హిందీ మ్యూజిక్ లవర్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్ సింగింగ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు స్టార్ సింగర్ అరిజీత్ సింగ్ అనౌన్స మెంట్ ఇందుకు కారణం. తుమ్ హి హో, హవాయేం, జాలీమా వంటి బ్యాక్-టు-బ్యాక్ సూపర్ హిట్ పాటలు పాడిన సింగర్ అరిజీత్ మంగళవారం (జనవరి 27) షాకిచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్ గా మారింది. దీన్ని విరాట్ కోహ్లి టెస్టు రిటైర్మెంట్ తో పోలుస్తున్నారు.

మంచి ఫామ్, ఫిట్ నెస్ ఉన్నప్పటికీ 2025లో కోహ్లి సడెన్ గా టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అరిజీత్ రిటైర్మెంట్ పోస్టుకు స్పందిస్తూ ఒక అభిమాని.. "ఇది విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ స్థాయి షాక్" అని అన్నాడు.

''అరిజీత్ సింగ్ చెప్పినట్లుగా సంగీ...