భారతదేశం, జనవరి 28 -- మ్యూజిక్ లవర్స్ కు మంగళవారం (జనవరి 27) దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అరిజిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి వైదొలగనున్నట్లు ప్రకటించారు. ఇకపై ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టనని ఆయన తెలిపారు. అరిజిత్ సింగ్ రిటైర్మెంట్ పై చిన్మయి శ్రీపాద రియాక్టయింది. అతనితో పని చేసిన అనుభవాన్ని ఈ సింగర్ పంచుకుంది.

చిన్మయి పోస్ట్

'మాస్ట్ మగన్', 'సూయీన్ సి' వంటి పాటల్లో అరిజిత్‌తో కలిసి పనిచేసిన గాయని చిన్మయి శ్రీపాద తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చింది. ''ప్రీతమ్ సార్ కోసం రికార్డ్ చేస్తున్నప్పుడు అరిజిత్‌ను కలిసినట్లు నాకు గుర్తుంది. అతను బాలీవుడ్ ను రూల్ చేయడం లేదని చెప్పినట్లు గుర్తుంది. అప్పటికీ ఇంకా 'తుమ్ హి హో' విడుదల కాలేదు. అతను అత్యంత డిమాండ్ ఉన్న సింగర్‌గా మారిన తర్వాత కూడా అతనితో కలిసి పని చేశా. కానీ అ...