Hyderabad, ఏప్రిల్ 16 -- అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే అరటిపండ్లు, మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరకడంతో పాటు శరీరానికి అధిక ప్రయోజనాలు కలిగిస్తాయి. కేవలం ఫిజికల్ వర్కౌట్లు చేసే సమయంలో ఎనర్జీ కోసం, ఎసిడిటీ సమస్యను నివారించేందుకు అరటిపండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవేకాకుండా, అరటిపండు చేసే మరో మేలు ఏంటంటే, హైబీపీని అదుపు చేయడం. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ - రెనల్ ఫిజియాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ విషయం రుజువైందట.

అరటిపండ్లలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంతో పాటు ఆరోగ్యం విషయంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మీ రక్తపోటుపై ఉప్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చాలా మందికి తెలుసు. చాలా సార్లు, ఉప్పును పూర్తిగా తగ్గించమని ఇతరులకు సలహా ఇస్తారు కూడా. కానీ, ఈ అధ్యయనం ప్రకారం, ఉప్పగా ఉండే ఆహారాన్ని తగ్గించడం కంటే, మీ ఆహారంలో పొటాషియంను చేర...