భారతదేశం, డిసెంబర్ 28 -- ఓవైపు వరుస సెలవులు. అందులోనూ వీకెండ్..! అంతేకాకుండా ఇయర్ ఎండ్ కావటంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు పర్యాటకులు క్యూ కట్టారు. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకులతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అరకు లోయంతా కూడా టూరిస్టులతో కిక్కిరిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి.

భారీగా టూరిస్టుల వస్తుండటంతో. అరకు లోయలో హోటల్స్ అన్ని హౌస్ ఫుల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసేందుకు. టూరిస్టులు తెగ తరలివ్తున్నారు. దట్టమైన పొగమంచు అందాలను కెమెరాలను బంధిస్తున్నారు. విశాఖ, అరకు, పాడేరుల్లో హోటల్స్ కి తెగ డిమాండ్ పెరిగింది.

బొర్రా గుహలు, జలపాతాలు, అరకు లోయ, మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, చాపరాయి గెడ్డ, పాడేరు కాఫీ తోటలు, వంజంగి హిల్స్‌, కొత్తపల్లి జలపాతం, లంబసింగి ప్రాంతాల్లో టూరిస్టుల ర...