భారతదేశం, నవంబర్ 9 -- అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇటీవలనే చర్లపల్లి, నర్సాపుర్, మచిలీపట్నం నుంచి 50 రైళ్లను ప్రకటించగా. తాజాగా వేర్వురు స్టేషన్ల నుంచి మరో 54 రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

కొద్దిరోజులుగా శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రద్దీ పెరుగుతున్న దృష్ట్యా శబరిమలకు తాజాగా 54 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం. ఈ రైళ్లు కాకినాడ, నాందేడ్​, చర్లపల్లి స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి రిజర్వేషన్లకు అవకాశం కల్పించింది.

ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 17, 2025 నుంచి జనవరి 20, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు ఏపీ, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ కేరళలోని కొల్...