భారతదేశం, నవంబర్ 28 -- అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుముడి తీసుకెళ్లే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వెళ్లే స్వాములు విమాన ప్రయాణం సమయంలో తమ పవిత్ర ఇరుముడిని చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించిన కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

"శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు...