భారతదేశం, ఆగస్టు 5 -- భారీ అంచనాలతో స్పై థ్రిల్లర్ గా థియేటర్లలోకి వచ్చిన కింగ్డమ్ మూవీకి కష్టాలు తప్పడం లేదు. మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. విజయ్ దేవరకొండ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా కష్టపడక తప్పదు. కానీ ఆ దిశగా మెరుగైన సంకేతాలు కనబడటం లేదు. కింగ్డమ్ సినిమా జులై 31న రిలీజైంది. విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు. మరి అయిదు రోజుల్లో ఈ మూవీ ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టిందో చూద్దాం.

విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ డ్రామా కింగ్డమ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ రిలీజైన తర్వాత మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఆ తర్వాత షాక్ తప్పడం లేదు. సక్నిల్క్ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం 5వ రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. సోమవ...