Hyderabad, మే 11 -- పట్టినప్పుటి నుంచి జీవితంలోని ప్రతి అడుగులోనూ తోడుండే అమ్మ కోసం ఒక ప్రత్యేకమైన రోజు మదర్స్ డే. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 11న ఈ ప్రత్యేకమైన రోజు వస్తోంది. అమ్మ ప్రేమను కొనియాడే మధురమైన రోజు ఇది. అమ్మ మన కోసం వెచ్చించిన ప్రతి క్షణం, చేసిన ప్రతి త్యాగం, భరించిన ప్రతి కష్టం... వాటిని గుర్తుచేసుకునే పవిత్రమైన సందర్భం ఇది. నిజానికి అమ్మ ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు. ఆ ప్రేమను పొగిడేందుకు మాటలు కూడా చాలవు.

అమ్మకు మనం తిరిగి ఏమివ్వగలమో తెలియదు కానీ, ప్రతి బిడ్డకు తన తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశం. ఈ రోజున మీ హృదయంలోని ప్రేమానురాగాలను, మీ శ్రద్ధను తెలిపే కొన్ని అందమైన, మనసుకు హత్తుకునే మాటలు లేదా కవితలను మీ అమ్మకు పంపించి ఆమె కళ్ళల్ల...