భారతదేశం, మే 11 -- అమ్మ అంటే ప్రాణం. అమ్మ అంటే నమ్మకం. అమ్మ అంటే ధైర్యం. అమ్మ అంటేనే జీవితం. అలాంటి తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాతృమూర్తి గురించి పొగడటానికి మాటలు సరిపోవు. తల్లిని కీర్తిస్తూ టాలీవుడ్ సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో స్పెషల్ గా నిలిచిపోయాయి. 'ఒకే ఒక జీవితం' సినిమాలోని 'అమ్మ' సాంగ్ కూడా అలాంటిదే. ఆదివారం (మే 11) మదర్స్ డే సందర్భంగా ఓ సారి అమ్మ కోసం మీరూ పాడేయండి.

చనిపోయిన తల్లిన మళ్లీ బతికించుకోవడం కోసం టైమ్ ట్రావెల్ చేసే ఓ కొడుకు కథే 'ఒకే ఒక జీవితం' సినిమా. ఇందులో హీరో శర్వానంద్ కాగా.. అమ్మగా అక్కినేని అమల యాక్ట్ చేశారు. హీరో టైమ్ ట్రావెల్ చేశాక వచ్చే ఈ అమ్మ సాంగ్ మనసుకు హత్తుకుపోతోంది. 'నీ పాదాలకు మువ్వల్లే' అంటూ ఈ సాంగ్ లిరిక్స్ హృద‌యాలను తాకుతోంది.

దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కల...