భారతదేశం, మే 9 -- అమ్మ లేనిదే జన్మ లేదు. అమ్మ లేనిదే జీవితం లేదు. అమ్మ లేనిదే అసలు మనమే లేం. ఆ అమ్మ గొప్పతనాన్ని చాటేందుకు ఎన్ని మాటలైనా చాలవు. అమ్మ ఆప్యాయతను చెప్తూ, అమ్మ కష్టాన్ని గుర్తు చేస్తూ తెలుగు సినిమాల్లో ఎన్నో పాటలు వచ్చాయి. వీటిల్లో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలోని 'నీవే నీవే' సాంగ్ మాత్రం స్పెషల్ గా నిలిచిపోయింది. మే 11న మదర్స్ డే రోజు మీ అమ్మ కోసం ఈ సాంగ్ పాడేయండి.

'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీలోని 'నీవే నీవే' సాంగ్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఈ పాటలోని లిరిక్స్ గుండెను హత్తుకునేలా ఉన్నాయి. సినిమా రిలీజై రెండు దశాబ్దాలు గడిచిపోయినా ఈ మాట పాత్రం వినిపిస్తూనే ఉంటోంది. 2003లో 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ రిలీజైంది.

జయసుధ, రవితేజ తల్లీకొడుకులుగా యాక్ట్ చేశారు....