భారతదేశం, ఏప్రిల్ 20 -- జీవనశైలిలో ఎన్నో సాంకేతికతో ముందుకు సాగుతున్న నేటి సమాజంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తీర్యాని మండలం లో మాత్రం భిన్నంగా కొనసాగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలంలోని మారుమూల గ్రామం సమతులగుండంలో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. "గ్రామం రమ్మంటుంది... దయ్యం పొమ్మంటుంది..." అన్న మాటలే ఇప్పుడు అక్కడి ప్రజల నోట నిత్యం వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాల పేరుతో ఓ పాత వదంతి మరోసారి భయాందోళన సృష్టించింది.

గ్రామంలో గత నెల రోజుల నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారానికి ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఇలా అనుమానాస్పదంగా మరణించడాన్ని దయ్యాల పనేనని భావించిన గోండు గిరిజనులు పెద్ద ఎత్తున గ్రామాన్ని విడిచిపెట్టి పొరుగువూర్లకు వెళ్తున్నారు. గత రెండు రోజులుగా సుమారు 10 కుటుంబాలు గ్రామాన్ని వదిలి పక్కనున్న లింగాపూర్ గ్రామం భీమ...