భారతదేశం, నవంబర్ 3 -- స్వదేశంలో ప్రపంచ కప్‌ను కోల్పోవడం ఎంత బాధ కలిగిస్తుందో రోహిత్ శర్మకు బాగా తెలుసు. నవంబర్ 19, 2023 నాటి చేదు జ్ఞాపకాన్ని ఎవరు మర్చిపోగలరు? అప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్. ఇప్పుడు ఇండియాలో మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలవగానే రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడు.

ఆదివారం (నవంబర్ 2) అర్ధరాత్రి నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు తమ తొలి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలిచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని టీమ్ చరిత్ర సృష్టించింది. స్టేడియంలో ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అతను కళ్లలో నీళ్లు కనిపించాయి. కిక్కిరిసిన స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ పోరులో దక్షి...