భారతదేశం, ఫిబ్రవరి 12 -- బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, న్యూ నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'ఓ రోమియో' (O Romeo). ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కమెడియిన్ కపిల్ హోస్ట్‌గా చేస్తున్న 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇండియా విడుదల చేయగా, అందులో షాహిద్ తనదైన శైలిలో వేసిన పంచ్‌లు హైలైట్‌గా నిలిచాయి.

షో మధ్యలో హోస్ట్ కపిల్ శర్మ తనదైన శైలిలో షాహిద్‌ను ఆటపట్టించారు. "పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా.. వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు ఇప్పటికీ అమ్మాయిల నుంచి డిఎమ్ (Direct Messages)లు వస్తుంటాయా?" అని అడిగారు.

దీనికి షాహిద్ కపూర్...