Hyderabad, జూలై 31 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటనకు పెట్టింది పేరు. మ్యాచో హీరోగా యాక్షన్, ఎమోషనల్ సీన్ల్స్‌లో ఇంటెన్సివ్ యాక్టింగ్‌తో ఇరగదీస్తారు. అటువంటి మోహన్ లాల్ అమ్మాయిలా నగలు వేసుకుని మురిసిపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

నిజానికి అది ఒక జ్యూవెలరీ యాడ్. లింగ నిబంధనలను, లింగ వివక్షను సవాలు చేస్తూ ఓ జ్యూవెలరీ యాడ్‌లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు మోహన్ లాల్. విన్స్‌మెరా జ్యువెల్స్ కోసం ఒంటిపై ఆభరణాలు వేసుకుని మోహన్ లాల్ చేసిన యాడ్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

సాధారణంగా మోహన్ లాల్ ఓ మగాడిగా, మ్యాచోగా కనిపించడాన్ని ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడతారు. ఈ విషయంలో తాను ముందే భయపడినట్లు, ట్రోలింగ్ ఎదుర్కొనే అవకాశం ఉందని టెన్షన్ పడినట్లు మోహన్ లాల్ పర్సనల్ స్టైలిస్ట్ శాంతి కృష్ణ తాజాగా ఆమె ఫీలింగ్స్ బయటపెట్టార...