భారతదేశం, నవంబర్ 18 -- రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు అయిన ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఐఐటీ హైదరాబాద్ కు వెళ్లిన ఆమె.. అక్కడి అమ్మాయిలకు ఇచ్చిన సలహాపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ముందు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించాలని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.

ఉపాసన సోమవారం (నవంబర్ 17) హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ కు వెళ్లి అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది. "ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ తో మాట్లాడటం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీలో ఎంత మంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని నేను అడిగినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ మంది చేతులు లేపారు.

అమ్మాయిలు కెరీర్ పైనే దృష్టి సారించినట్లు అనిపించింది. ఇది సరికొత్త ప్రోగ్రెసివ్ ...