భారతదేశం, నవంబర్ 13 -- రవిబాబు.. టాలీవుడ్ లో విలక్షణ నటుడుగానే కాకుడా వైవిధ్యమైన సినిమాలు తీసే డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత ఓటీటీ కోసం ఓ మూవీ తీశాడు రవిబాబు. 'ఏనుగు తొండం ఘటికాచలం' అనే వెరైటీ టైటిల్ తో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇవాళే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది.

ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. ఏనుగు తొండం ఘటికాచలం సినిమా గురువారం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి రవిబాబు డైరెక్టర్. ఇందులో టాలీవుడ్ లోని అగ్ర కమెడియన్లు నటించారు.

టైటిల్ నే డిఫరెంట్ గా ప్లాన్ చేసి సగం మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ రవిబాబు. ఏనుగుతొండం ఘటికాచలం మూవీ పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అయింది. ఈ సినిమాలో నరేష్ వ...