భారతదేశం, డిసెంబర్ 30 -- తిరుమల క్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. మంగళవారం (డిసెంబర్ 30) తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. వీరిలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తల్లి డాక్టర్ స్వర్ణలత, అమ్మమ్మతో కలిసి హీరోయిన్ శ్రీలీల స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీలీల ఆలయానికి చేరుకున్నారని తెలియగానే అభిమానులు ఆమెను చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో తన అమ్మమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని శ్రీలీల ఎంతో కంగారు పడ్డారు.

"అమ్మమ్మ.. కింద చూసుకో" అంటూ ఆమెను జాగ్రత్తగా పట్టుకుని, జనం మధ్యలో నుంచి భద్రంగా తీసుకువెళ్లారు శ్రీలీల. సెక్యూరిటీ సిబ్బంది ఫ్యాన్స్‌ను పక్కకు తప్పుకోమని కోరుతున్న...