భారతదేశం, ఏప్రిల్ 3 -- భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ మార్చి 2025 మొత్తం ఆర్థిక సంవత్సరం 2024-25 లో అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. మార్చి 2025లో కంపెనీ మొత్తం 5,49,604 యూనిట్లను విక్రయించింది. ఇది మార్చి 2024తో పోలిస్తే 12.07 శాతం పెరిగింది. అదే సమయంలో ఫిబ్రవరి 2025తో పోలిస్తే 41.63 శాతం వృద్ధి నమోదైంది. ఇది కంపెనీ అద్భుతమైన వృద్ధిని సూచిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 58 లక్షల యూనిట్లకుపైగా అమ్మకాలను సాధించింది.

దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ 2025 మార్చిలో 5,10,086 యూనిట్లను విక్రయించింది. 2025 ఫిబ్రవరితో పోలిస్తే అమ్మకాలు 42.76 శాతం పెరిగాయి. ఎగుమతుల విషయానికొస్తే, 2025 మార్చిలో 39,518 యూనిట్లు పంపించారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 25.38 శాతం ఎక్కువ.

కంపెనీ మొత్తం అమ్మకాల్లో మోటారు స...