భారతదేశం, ఏప్రిల్ 25 -- రియల్మీ తన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్ రియల్మీ 14టీ 5జీని భారత్ లో లాంచ్ చేసింది. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇది ఇదే ధర సెగ్మెంట్లో ఉన్న ఒప్పో కే13 5జీ స్మార్ట్ ఫోన్ కు గట్టి పోటీనిస్తోంది.

రియల్మీ 14టీ 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, హైఎండ్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.19,999. కొనుగోలుదారులు మూడు రంగుల నుండి ఎంచుకోవచ్చు. అవి లైట్నింగ్ పర్పుల్, అబ్సిడియన్ బ్లాక్, సర్ఫ్ గ్రీన్. ఫ్లిప్ కార్ట్ తో పాటు రియల్ మీ అధికారిక ఇండియన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

రియల్ మీ 14టీ 5 జీ స్మార్ట్ ఫోన్ లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డ...