భారతదేశం, జనవరి 7 -- న్యూఢిల్లీ, జనవరి 7, 2026: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, అక్కడ స్థిరపడాలని కలలు కనే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) గట్టి హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడి చట్టాలను ఏమాత్రం అతిక్రమించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.

"వీసా అనేది మీ హక్కు కాదు.. అదొక అవకాశం మాత్రమే" సోషల్ మీడియా వేదికగా యూఎస్ ఎంబసీ ఈ హెచ్చరికను విడుదల చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. "అమెరికా చట్టాలను ఉల్లంఘించడం వల్ల మీ స్టూడెంట్ వీసాపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఏదైనా చట్టవిరుద్ధమైన పని చేసి మీరు అరెస్టయితే, మీ వీసాను తక్షణమే రద్దు చేస్తారు. అంతటితో ఆగకుండా మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరించే (Deportation) అవకాశం కూడా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ ఎప్పటికీ మీకు అమెరిక...