భారతదేశం, నవంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరించిన తర్వాత నిరాశతో ఇలా చేసిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరుకు చెందిన రోహిణి.. హైదరాబాద్‌లోని పద్మారావు నగర్‌లో ఒంటరిగా నివసిస్తోంది. శనివారం ఉదయం రోహిణి తలుపు తెరవకపోవడంతో ఆమె ఇంటి పనిమనిషి చాలాసేపు కాలింగ్ బెల్ కొట్టింది. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వారు పదే పదే ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హైదరబాద్ వచ్చి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

పోస్ట్‌మార్టం నివేదిక ద్వారా మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. రోహిణి మృతదేహాన్ని ఆమె...