భారతదేశం, సెప్టెంబర్ 8 -- అమెరికా వెళ్లాలని కలలు కంటున్నవారికి, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, టూరిస్టులు, వ్యాపారవేత్తలకు యూఎస్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఇకపై నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) ఇంటర్వ్యూలకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ సొంత దేశంలోనే హాజరు కావాలి. వేగంగా అపాయింట్‌మెంట్లు దొరుకుతాయని ఇతర దేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునే పద్ధతికి దీనితో తెర పడింది.

అమెరికా విదేశాంగ శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కొత్త నిబంధనలను వెల్లడించింది. దీని ప్రకారం, ఎవరైనా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, వారు తమ సొంత దేశం లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలోని అమెరికా ఎంబసీ లేదా కాన్సులేట్‌లో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. అయితే, కొన్ని దేశాలలో అమెరికా ప్రభుత్వం వీసా సేవలు అందించకపోతే మాత్రం దీనికి మినహాయింపు ఉంటు...