భారతదేశం, డిసెంబర్ 9 -- యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్​సీఐఎస్​) ఇటీవల ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) (దీనినే సాధారణంగా 'వర్క్ పర్మిట్' అంటారు) కాలపరిమితిపై కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ మార్పు ప్రధానంగా అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకుని, ఆ ప్రక్రియలో ఉన్న వలసదారులపై ప్రభావం చూపనుంది!

డిసెంబర్ 5వ తేదీ నుంచి, కొత్తగా మంజూరు చేసే లేదా రెన్యువల్​ చేసే ఈఏడీల గరిష్ట కాలపరిమితిని 18 నెలలకు పరిమితం చేసింది యూఎస్​సీఐఎస్.

ఈ తేదీకి ముందు ఈఏడీ పొందిన వారికి, వారికి మొదట మంజూరు చేసిన పూర్తి కాలపరిమితి అలాగే ఉంటుంది. అయితే, భవిష్యత్తులో వారు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, కొత్తగా అమల్లోకి వచ్చిన 18 నెలల పరిమితి మాత్రమే వర్తిస్తుంది (న్యూస్‌వీక్ నివేదిక ప్రకారం).

ఈ మార్పుల వల...