భారతదేశం, ఏప్రిల్ 18 -- అమెరికాలోని తల్లాహసీ నగరంలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. 20 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. లియోన్ కౌంటీ షెరీఫ్ డిప్యూటీ జెస్సికా ఇక్నర్ కుమారుడు ఫీనిక్స్ ఇక్నర్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు.

ఈ కాల్పులతో వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఈ కాల్పులను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు ప్రాణాలతో బయటపడటం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ భవనం సమీపంలో కాల్పులు జరిగాయి. ఉదయం 11:20 గంటల సమయంలో కాల్పులు జరిగాయని, ఆ సమయంలో కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు దాక్కోవడానికి బౌలింగ్ గల్లీకి వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారని తెలిసింది. కాల్పులు జరిగిన సమయంలో స్టూ...