భారతదేశం, ఆగస్టు 17 -- అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఓ న్యూస్. ట్రంప్ పరిపాలన పారసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వలసదారుల పరిశీలనను కఠినతరం చేస్తూ.. తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో భాగంగా 'మంచి నైతిక స్వభావాన్ని' కలిగి ఉన్నారో లేదో నిర్ణయించేటప్పుడు అదనపు అంశాలను పరిశీలించనున్నారు. గతంలో ఇది ఉన్నదే అయినప్పటికీ మరిన్ని విషయాలను ఇందులో చేర్చారు. దేశ చట్టపరమైన వలస వ్యవస్థను పర్యవేక్షించే సమాఖ్య సంస్థ అయిన యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

సాధారణంగా యూఎస్ శాశ్వత నివాసం లేదా గ్రీన్ కార్డ్ ఉన్న చట్టబద్ధమైన వలసదారులు.. వారి కేసును బట్టి 3 లేదా 5 సంవత్సరాల వ్యవధి తర్వాత సహజసిద్ధమైన అమెరికన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీష్, పౌర పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంతో...