భారతదేశం, జనవరి 5 -- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంలో కలకలం రేగింది. ఓహియోలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో కిటికీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీఎన్ఎన్ (CNN) కథనం ప్రకారం, సిన్సినాటిలోని వాన్స్ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, అదృష్టవశాత్తు ఆ సమయంలో ఉపాధ్యక్షుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంట్లో లేరు. నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని, కేవలం బయటి నుండే కిటికీలను పగులగొట్టాడని ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారించాయి.

స్థానిక వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. ఈ దాడిలో ఇంటి వెలుపలి కిటికీల అద్దాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలం వద్ద అద్దపు ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షుల భద్రతను పర...