భారతదేశం, ఆగస్టు 15 -- డేటింగ్ లో ఉన్నారనే రూమర్ల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా కనిపించారు. వీళ్లు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం అమెరికాకు వెళ్లారు. వీళ్ల వీడియో వైరల్ గా మారింది. లవ్ బర్డ్స్ జంటగా కనిపించడం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న శుక్రవారం (ఆగస్టు 15) న్యూయార్క్ చేరుకున్నారు. ప్రస్తుతం సురేష్ పీఆర్వో షేర్ చేసిన వీడియో ప్రకారం, న్యూయార్క్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో జరిగే ఇండియా డే పరేడ్ లో వీళ్లు అటెండ్ కావాల్సి ఉంది. క్యాజువల్ దుస్తులు ధరించిన వీరిద్దరూ విడివిడిగా వేదిక వద్దకు చేరుకోవడం, అక్కడ వారికి సాదర స్వాగతం పలకడం, పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించడం వీడియోలో చూడొచ్చు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) 43వ వా...