భారతదేశం, జనవరి 5 -- అమెరికాలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంపతులు మృతి చెందారు. వాషింగ్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో కొటికలపూడి కృష్ణ కిశోర్ (45), ఆశ (40) ప్రాణాలు కోల్పోయారు. వారి కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

కృష్ణ కిశోర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. 10 రోజుల క్రితమే కృష్ణ కిశోర్, ఆశ పాలకొల్లు వచ్చి వెళ్లారు. ఇటీవలే దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో కిశోర్, ఆశ దంపతులు మృతి చెందారు. దీంతో పాలకొల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణించారు. మహబూబాబాద్ జిల్లా...