భారతదేశం, డిసెంబర్ 31 -- అమెరికాలో గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం రెండు వేర్వేరు రాష్ట్రాల్లోని షాపింగ్ మాల్స్ వద్ద కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలు స్థానికులను, పర్యాటకులను భయాందోళనకు గురిచేశాయి. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మాల్స్ అన్నీ కిక్కిరిసి ఉన్న సమయంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

న్యూజెర్సీలోని వేన్ (Wayne) ప్రాంతంలో ఉన్న ప్రముఖ విల్లోబ్రూక్ మాల్‌లో మంగళవారం సాయంత్రం కాల్పుల శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై అధికారికంగా ఇంకా నిర్ధారణ రాలేదు.

సాక్షుల కథనం: "ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మాల్ చుట్టూ పోలీసులు భారీగా మొహరించారు. అన్ని వైపుల నుంచి పోలీస్ వాహనాలు రావడం చూశాను. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని ఒక ప్రత్యక్ష సాక్షి ఫేస్‌బుక్‌లో ఆందోళన వ...