భారతదేశం, డిసెంబర్ 27 -- అమెరికాలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది. క్రిస్మస్ సెలవుల సందడి ముగించుకుని తిరిగి ఇళ్లకు చేరుకుంటున్న ప్రయాణికులకు వాతావరణం చుక్కలు చూపిస్తోంది. న్యూయార్క్ నగరం నుంచి ఈశాన్య న్యూజెర్సీ, లోయర్ హడ్సన్ వ్యాలీ, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ వరకు మంచు తుపాను హెచ్చరికలు జారీ కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

వరుసగా కురుస్తున్న మంచు, గడ్డకట్టే చలి కారణంగా విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'ఫ్లైట్ అవేర్' (FlightAware) గణాంకాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 1,802 విమానాలు రద్దు కాగా, 22,349 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ముఖ్యంగా న్యూయార్క్ నగర పరిధిలోని మూడు ప్రధాన విమానాశ్రయాలైన లాగార్డియా, జేఎఫ్‌కే (JFK), నెవార్క్‌లలో క్యాన్సలేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. డ...