భారతదేశం, ఫిబ్రవరి 15 -- అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది! కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో పీజీ చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య (22) మరణించినట్లు భారత రాయబార కార్యాలయం ఆదివారం ఉదయం ధృవీకరించింది. గత కొద్దిరోజులుగా సాకేత్ ఆచూకీ కోసం గాలిస్తున్న స్థానిక పోలీసులు, చివరకు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషాద వార్తను శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

"అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ అత్యంత కఠినమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము," అని కాన్సులేట్ పేర్కొంది. సాకేత్ భౌతిక కాయాన్ని వీలైనం...