భారతదేశం, జూలై 2 -- అమెరికాలో పనిచేస్తున్న ఒక భారతీయుడు తనకు ఆఫీస్ లో జరిగిన అవమానం గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో వెల్లడించాడు. ఆఫీస్ మీటింగ్ ల్లో ఉచ్ఛారణ అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని, కాబట్టి సమావేశాల్లో మాట్లాడటం మానేయమని తనను అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.

32 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ భారతీయ ఉద్యోగి గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తాను అనుభవించిన పనిప్రాంత వివక్షపై తన ఆవేదనను ఆ రెడ్డిట్ పోస్ట్ లో వ్యక్తం చేశాడు. తను పనిచేస్తున్న టీమ్ లో అందరూ అమెరికన్లే ఉన్నారని, వారు తనను ఆఫీస్ మీటింగ్ లలో మాట్లాడడం మానేయాలని అడిగారని అతడు వెల్లడించాడు. "

ఈ రోజు, ఒక సమావేశంలో, నా సాధారణ బాధ్యతల్లో భాగంగా ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఒక టీమ్ సభ్యుడిని (సుమారు 55 సంవత్సరాలు) అడిగాను. నా యాస అర్థం కాకప...