భారతదేశం, జనవరి 6 -- అమెరికాలో తన మాజీ ప్రియుడి చేతిలో నిఖితా గోడిశాల(27) హత్యకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై మృతురాలి తండ్రి ఆనంద్ గోడిశాల స్పష్టత ఇచ్చారు. అర్జున్ శర్మ, నిఖితా ప్రేమికులు కాదని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణం అని చెప్పారు.

మేరీల్యాండ్‌లోని కొలంబియాలోని హోవార్డ్ కౌంటీలో నిఖితా గొడిశాల (27) హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెను కత్తితో పొడిచి, ఆమె కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడని, ఆపై భారతదేశానికి పారిపోయాడని పోలీసులు మెుదటగా భావించారు. తన కుమార్తె హత్యపై తండ్రి ఆనంద్ గొడిశాల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

26 ఏళ్ల నిందితుడు అర్జున్ శర్మ తన కుమార్తె మాజీ ప్రియుడు అనే విషయాన్ని ఆనంద్ గోడిశాల ఖండించారు. అర్జున్ శర్మ, నిఖితాతోపాటుగా మరో ఇద్దరు రూమ్‌మేట్స్‌గా ఉండేవారని చెప్పారు. 'నా కూత...