భారతదేశం, ఆగస్టు 28 -- అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. వీసాల జారీకి ఇప్పటికే సోషల్ మీడియా చెకింగ్ కఠినంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, విదేశీ జర్నలిస్టులకు జారీ చేసే వీసాలకు టైమ్ లిమిట్ ఉండనుంది. ఈ మేరకు పరిమిత కాల గడువును తీసుకురానుంది అమెరికా. దీంతో యూఎస్‌లో చదవాలనుకునేవారు కేవలం నాలుగేళ్లు మించి అక్కడ ఉండరాదు. ఈ మేరకు వీసాలో మార్పులు రానున్నాయి.

చట్టపరమైన వలసలపై అణచివేతలో భాగంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది అమెరికా. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా సభ్యులకు వీసాల వ్యవధిని కఠినతరం చేయాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అణచివేతకు శ్...