భారతదేశం, జూలై 8 -- హైదరాబాద్/డల్లాస్: అమెరికాలో ఒక హైదరాబాద్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదంలో సజీవదహనమైంది. డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బెజిగం శ్రీవెంకట్ (39), ఆయన భార్య చొల్లేటి తేజస్విని (34), వారి కుమారుడు సిద్ధార్థ (9), కుమార్తె శ్రీహాన్ (7) అట్లాంటా నుంచి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గ్రీన్ కౌంటీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సికింద్రాబాద్ తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన శ్రీవెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌సీఎల్ నార్త్ అవెన్యూకు చెందిన తేజస్విని దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. 2013లో పెళ్లయిన వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. 2022లో శ్రీవెంకట్ ఉద్యోగ నిమిత్తం అమెరికాలోని డల్లాస్‌కు వెళ్లారు. 6 నెలల తర్వాత భార్యాపిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లారు. కొం...