Hyderabad, ఏప్రిల్ 28 -- టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన సినిమా కన్నప్ప. త్వరలో ప్రేక్షకుల ముందుకు కన్నప్ప రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నప్పపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. కన్నప్ప నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.

అలాగే, కన్నప్ప సినిమా నుంచి రిలీజయిన పాటలు అయితే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. అయితే, కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా పెంచాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు కన్నప్ప సినిమాను నిర్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక కన్నప్ప సినిమ...