భారతదేశం, జనవరి 15 -- అమెరికాలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని ఐసిఇ (ICE) అధికారులు అరెస్ట్ చేశారని, విమానంలో అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆ సంస్థ సీఈఓ సలీల్ పరేఖ్ ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, తమ ఉద్యోగులెవరూ అక్కడ నిర్బంధానికి గురికాలేదని ఆయన స్పష్టం చేశారు.

జనవరి 14న కంపెనీ మూడో త్రైమాసిక (Q3) ఫలితాల ప్రకటన సందర్భంగా సలీల్ పరేఖ్ ఈ అంశంపై మాట్లాడారు.

"అమెరికా అధికారులు ఇన్ఫోసిస్ ఉద్యోగి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. అయితే, కొన్ని నెలల క్రితం మా ఉద్యోగి ఒకరికి అమెరికాలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు (Denied Entry). దీంతో ఆయనను తిరిగి ఇండియాకు పంపించారు. అంతే తప్ప, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు" అని ఆయన వివరించారు.

జనవరి 13న 'చేతన్ అనంతరాము' అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. మైసూరుకు చెందిన ఒక ...