భారతదేశం, నవంబర్ 19 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్‌మెంట్‌లో 2017లో మృతి చెందారు. ఎనిమిది సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత అమెరికా అధికారులు ఒక భారతీయ వ్యక్తి హత్య చేసినట్టుగా గుర్తించారు. నజీర్ హమీద్ న్యూజెర్సీకి చెందిన ఒక కంపెనీలో శశికళ నర్రా భర్తకు సహోద్యోగి అని, అతడే హత్య చేసినట్టుగా తెలుసుకున్నారు.

ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు అనే వ్యక్తి న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), అతని 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి నివసించేవాడు. మార్చి 23, 2017న ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అపార్ట్‌మెంట్‌లో భార్య, కుమారుడు చనిపోయి కనిపించారు. వారిపై అనేక కత్తిగాట్లు ఉన్నాయి. వారిద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే హనుమంతరావు పోలీసులకు సమాచ...