భారతదేశం, మే 24 -- ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో రెమిటెన్స్ ఎక్సైజ్ టాక్స్ ఒకటి. అమెరికాలో నివసిస్తున్న వారు తమ స్వదేశాలకు, అమెరికాయేతర దేశాల్లోని వారికి కానీ పంపించే డబ్బుపై విధించనున్న పన్ను ఇది.

అయితే, ప్రతిపాదిత బిల్లులో ఈ రెమిటెన్స్ ఎక్సైజ్ టాక్స్ ను 5% గా నిర్ణయించారు. అయితే, ఈ పన్నును 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించాలన్న సవరణను అమెరికా ప్రతినిధుల సభ 215-214 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని ట్రంప్ '''వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్'' గా అభివర్ణించారు. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు 'రెమిటెన్స్ పై పన్ను' విధించడం ఈ బిల్లులోని అతి ముఖ్యమైన లక్షణం. రెమిటెన్స్ టాక్స్ 3.5 శాతానికి తగ్గడం అమెరికాలో మెజారిటీ ఎన్ఆర్ఐలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఈ బిల్లు ప్రకా...