భారతదేశం, ఏప్రిల్ 18 -- ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన వంగవోలు దీప్తి (23) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు.

గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైనులో నివసించే దీప్తి టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నారు.మరో నెల రోజుల్లో ఆమె కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగం స్థిరపడనుంది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయమైంది. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయపడింది.

దీప్తి, స్నిగ్ధలు రోడ్డు ప్రమాదానికి గ...