భారతదేశం, జూలై 4 -- అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తీసుకొచ్చిన 'బిగ్​ బ్యూటిఫుల్​ బిల్లు' ఇప్పుడు అమెరికాను షేక్​ చేస్తోంది. దీనికి సానుకూలంగా- వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే, ట్రంప్​ బిల్లు అమెరికానే కాదు భారత్​ను, భారతీయులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎన్​ఆర్​ఐలు భారతదేశానికి పంపే లేదా పెట్టుబడి పెట్టే డబ్బు, అంటే రెమిటెన్స్​లపై అత్యధిక ప్రభావం ఉంటుంది. వలసల విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్" అని పేరు పెట్టిన 900 పేజీల వివరాలు ఇప్పుడు వెలువడ్డాయి కాబట్టి, భారతీయులపై తక్షణ ప్రభావాలను ఇక్కడ విశ్లేషిద్దాము..

అమెరికా నుంచి విదేశాలకు పంపే రెమిటెన్స్‌లపై మొదట ప్రతిపాదించిన 5 శాతం పన్నును తుది బిల్లులో కేవలం 1 శాతానికి తగ్గించారు. ఇది ఇప్పుడు ఆమోదం పొందింది. అమెరికాలో సుమారు 4.5 మిల...