భారతదేశం, మే 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంతో 'గోల్డెన్ డోమ్' అనే కొత్త క్షిపణి రక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బిల్లులో ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్లను కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు.

వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ తన పదవీకాలం ముగిసేనాటికి గోల్డెన్ డోమ్ పనిచేయడం ప్రారంభం కావాలని అన్నారు. ఈ గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ మొత్తం వ్యయం సుమారు 175 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను ప్లాన్ చేస్తున్న గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచంలోని 'ప్రతిదీ' అమెరికాలోనే తయారవుతుందని ఆయన చెప్పారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తి చూపిందని, ఈ ప్రయత్నంలో అమెరికా కెనడాకు మద్దతు ఇస్తుందని ట్రంప్ పే...