భారతదేశం, మే 13 -- ఏదైనా సినిమానో, వెబ్ సిరీసో ఆసక్తిగా చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్ వస్తే చిరాకు వేస్తుంది. దృష్టి పక్కకు మళ్లుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎలాంటి యాడ్స్ లేకుండా ప్రేక్షకులు కంటెంట్ చూశారు. అయితే, ఇక ప్రైమ్ వీడియోలోనూ యాడ్స్ మోత మోగనుంది. ఆ ఇబ్బంది ఎదురుకానుంది. యాడ్స్ ప్రసారం చేయడం గురించి ఆ ప్లాట్‍ఫామ్ ప్రకటించింది.

జూన్ 17వ తేదీ నుంచి సినిమాలు, వెబ్ సిరీస్‍ల మధ్యలో యాడ్లను ప్రదర్శించనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. మంచి కంటెంట్‍ను తీసుకొచ్చేందుకు, అందుకోసం మెరుగ్గా పెట్టుబడి పెట్టేందుకు ఈ యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం తమకు సాయపడుతుందంటూ రాసుకొచ్చింది. ఇతర స్ట్రీమింగ్ సర్వీసులు, ఇతర ప్లాట్‍ఫామ్‍ల కన్నా అర్థవంతమైన తక్కువ యాడ్స్ ఇస్తామంటూ ప్రకటించింది.

యాడ్ ఫ్రీ యాడ్ ...