భారతదేశం, మే 24 -- పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పెద్దగా అంచనాలు లేని ఓ చిత్రం ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ తక్కువ బడ్జెట్ మూవీ స్ట్రీమింగ్‍లో సత్తాచాటుతోంది. అలాగే రెండు తెలుగు సినిమాలు కూడా టాప్-5లో ట్రెండ్ అవుతున్నాయి. మరో తమిళ చిత్రం కూడా ట్రెండింగ్‍లో ఉంది. ఇలా అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్-5లో ప్రస్తుతం నాలుగు తెలుగు, తమిళ చిత్రాలు ఉన్నాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.

తమిళ యాక్షన్ కామెడీ మూవీ 'గ్యాంగర్స్' ప్రస్తుతం (మే 24) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల్లో నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఈ మూవీపై ఓటీటీలో ముందుగా పెద్దగా బజ్ నడవలేదు. కానీ స్ట్రీమింగ్‍కు వచ్చాక సత్తాచాటుతోంది. సుందర్ సీ దర్శకత్వం వహించిన ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా మే 15వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, మలయా...