భారతదేశం, ఏప్రిల్ 27 -- పాపులర్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల (ఏప్రిల్, 2025) అనేక సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. డిఫరెంట్ జానర్ల చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ఏడు సినిమాలు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించాయి. ఈ చిత్రాలు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ప్రైమ్ వీడియో ఓటీటీటో ఈనెల వచ్చిన 7 టాప్ చిత్రాలు ఏవంటే..

ఛోరీ 2 సినిమా ఈనెలలోనే ఏప్రిల్ 11వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. నుష్రత్ బరూచా, సోహా అలీ ఖాన్ ఈ హారర్ థ్రిల్లర్ చిత్రంలో లీడ్ రోల్స్ చేయగా.. విశాల్ ఫురియా దర్శకత్వం వహించారు. కూతురిని రక్షించుకునేందుకు తల్లి చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సీక్వెల్ చిత్రం సాగుతుంది. హారర్ ఎలిమెంట్లు, థ్రిల్లింగ్ సీన్లతో ఛోరీ 2 ఉంది.

తమిళ చిత్రం 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్' (నీక్)కు తెలుగు వెర్షన్ అయిన 'జ...